PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాఫీ ఎక్కువ తాగితే ఏమ‌వుతుందో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వర్క్‌ ప్రెషర్ పెరిగితే , వేరే ర‌క‌మైన‌ ఒత్తిడితో కాఫీ తెగ తాగుతుంటారు. కాఫీ ఎక్కువైతే కొన్ని చిక్కులు వ‌స్తాయ‌ని నిపుణులు సూచిస్తున్నారు. కాఫీ ఎక్కువైతే కిడ్నీలు కార్టిసాల్‌ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. మరి ఈ కార్టిసాల్‌తో మన చర్మంలోని గ్రంధుల నుంచి నూనె స్రావాలు పెరుగుతాయని.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు, ఇతర సమస్యలు వస్తాయని ఈస్తటిక్‌ క్లినిక్‌ ఫౌండర్‌ డాక్టర్‌ అహ్మద్‌ ఎల్‌ మాంటసర్ చెబుతున్నారు. దీనికితోడు ఆల్కహాల్‌ తరహాలోనే కెఫీన్‌ అధికంగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని, చర్మం పొడిబారి కాంతివిహీనంగా మారుతుందని అంటున్నారు. ఈ సమస్యలతో ఎవరైనా వారి వయసుకు మించి కనబడతారని వివరిస్తున్నారు.

                                               

About Author