NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దాతల విరాళం.. అభినందనీయం

1 min read

– కలెక్టర్​ జి. వీరపాండియన్​
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ (Fes) మదనపల్లి 7 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను, ఆశాజ్యోతి సంస్థ హైదరాబాద్ 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ కు బుధవారం విరాళంగా అందజేశారు. కలెక్టర్​ ఛాంబరులో కలెక్టర్​ వీరపాండియన్​ను మర్యాదపూర్వకంగా కలిసిన ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ, ఆశాజ్యోతి సంస్థ ప్రతినిధులు.. అనంతరం కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్​ బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. స్వచ్చంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు, సేవా సంస్థలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలోజాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు, జిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ జి నరేంద్రనాథ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్.మహబూబ్ బాషా, అపా ర్డ్ సంస్థ కర్నూలు సీఈఓ జి తిరుపతిరెడ్డి, ఫౌండేషన్ ఫర్ ఎకలాజికల్ సెక్యూరిటీ సంస్థ ప్రతినిధులు సదాశివ, ధన సేకరన్, తిరుపతి రెడ్డి, జి.వి రెడ్డి, హాబీబ్ బాషా పాల్గొన్నారు.

About Author