PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూర్ఛకు.. భయపడొద్దు..!

1 min read

– నవంబర్ 17న  జాతీయ ఎపిలెప్సీ దినోత్సవం

 – డాక్టర్. జాషువ కాలేబ్,  సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ , కిమ్స్ సవీర, అనంతపురం.

పల్లెవెలుగు:మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వారిలో అవగాహణ పెంచడానికి దేశ వ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతారు. మూర్ఛ వ్యాధి మెదడులో ఉన్న నరాలు కరెంట్ ప్రసరణలో భిన్నమైన మార్పులు కలగడం వల్ల మూర్చ వ్యాధి వస్తుంది. ఈ మార్పులకు అనేక కారణాలు ఉంటాయి. చిన్న వయసులో బిడ్డ ప్రసవించే సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం, శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గడం, మెదడులో ఆకార పరమైన మార్పులు రావడం కణుతులు ఏర్పడడం, పక్షవాతం వచ్చినప్పుడు మెదడులో మచ్చ ఏర్పడడం మరియు రక్తంలో అమ్మెనినియా లాంటి పదార్థాలు మోతాదు పెరగడం మరియు కొన్ని జన్యుపరమైన సమస్యలు ఉంటాయి.

వ్యాధి లక్షణాలు:

చేతులు కాళ్లు కొట్టుకోవడం, కళ్ళు ఆరప్పకుండా తెరిచి ఉంచడం, కొన్ని రకలైన ప్రవర్తన మార్పలు, చేతులు, కాళ్లు నిక్కబొడుచుకోవడం, కళ్లు ఒకేవైపు ఉంచడం, నోటి గుండా నరుగు రావడం, ఉన్నపాటుగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం.

మూరచ్ఛవ్యాథి గ్రస్తులు అనేక రకాలైన వివాహ, కుటుంబ సంబంధ సమస్యలతో బాధపడుతుంటారు. మూర్ఛవ్యాధి గ్రస్తులను వివాహం చేసుకోవడంలో వెనుకాడుతారు. ఈ జబ్బు పుట్టబోయే పిల్లలకు వస్తుందని వారు సాధారణ జీవితం జీవించలేరని అపోహాలు ఉన్నాయి. సరియైన వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లైతే వారు సాధారణ జీవితాన్ని జీవించగలరు. ఈ సంవత్సరం జాతీయ మూర్ఛవ్యాధి థీమ్ కళంకం అనే అంశంలో ముందుకు వెళ్తున్నారు. మూర్ఛ వ్యాధి ఉన్నవారిని మనలో ఒకరిగా చూడాలి. వారిని రోగులుగా చూడకూడదు.

మూర్ఛ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

మూర్ఛ వచ్చిన సమయంలో ఆ వ్యక్తితోనే ఉండాలి. పదునైన, హానికరమైన వస్తువులకు దూరంగా ఉంచాలి. ప్రక్కకు తిప్పి పడుకోబెట్టాలి. నోటిలో ఏ వస్తువులు పెట్టకూడదు. ఆ తర్వాత నరాల సంబంధిత వైద్యుని సంప్రదించి సరైన వైద్యం తీసుకోవాలి. మందులు క్రమం తప్పకుండా వాడాలి. నిద్ర, ఆహార నియమాలు పాటించాలి. మూర్ఛవ్యాధి గ్రస్తులను సరియైన వైద్య విధానాలు పాటించి జాగ్రత్తగా ఉన్నటైయితే అందరివలే సాధారణ జీవితాన్ని జీవించవచ్చు.

About Author