PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డా.స్వరూపరాణి సేవలు..చిరస్మరణీయం..

1 min read

ప్రొఫెసర్​ డా. రాజేష్​

  • పదవీ విరమణ పొందిన స్వరూపరాణిని ఘనంగా సన్మానించిన అధ్యాపకులు,విద్యార్థులు

కర్నూలు, పల్లెవెలుగు:కర్నూలు మెడికల్​ కళాశాలలో 32 సంవత్సరాలపాటు అధ్యాపకురాలిగా ఫార్మావిద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడంలో డా. స్వరూపరాణి పాత్రీ కీలకమన్నారు ప్రొఫెసర్​ డా.రాజేష్​.  శుక్రవారం డా. స్వరూపరాణి పదవీ విరమణ సందర్భంగా ఫార్మామెడికల్​ విద్యార్థులు, ప్రొఫెసర్లు ఆమెను ఘనంగా సన్మానించారు. శాలువ కప్పి పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డాక్టరుగా విధుల్లో చేరిన డా. స్వరూపరాణి నీతినిజాయితీ, నిబద్ధత.. క్రమశిక్షణతో పని చేసి ఎన్నో పదవులు అలంకరించిన ఘనత ఆమెకే దక్కిందన్నారు. భవిష్యత్​లో ఆమె సేవలు వినియోగించుకుంటామని, ఇందుకు పూర్తిస్థాయిలో డా. స్వరూపరాణి సహకరించాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. అనంతరం తోటి అధ్యాపకులు మాట్లాడుతూ డా. స్వరూపరాణి బోధనవిధానం ఎందరికో ఆదర్శమన్నారు. ఆమె సేవలు మరువలేమన్నారు. ఆ తరువాత పి.జి విద్యార్థులు మాట్లాడుతూ  అధ్యాపకురాలి బోధన పటిమ అద్భుతమన్నారు. ఆతరువాత డా. స్వరూపరాణి మాట్లాడుతూ డిపార్ట్​మెంట్​ మొత్తం ఒక కుటుంబ సభ్యురాలిగా తనను ఆదరించడం ఆనందంగా ఉందన్నారు.  పదవీ విరమణ పొందినా… తన సేవలు మెడికల్​ కాలేజికి అవసరమైతే తప్పకుండా అందజేస్తానన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు, పిజి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author