PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముందస్తుగా గుర్తిస్తేనే మేలు

1 min read

అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం

ఫిబ్రవరి 4న డాక్టర్. సి. గోపీనాథ్ రెడ్డి

కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్

కిమ్స్ హాస్పిటల్, కర్నూలు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహిస్తారు. క్యాన్సర్ సంరక్షణలో అసమానతలను పరిష్కరించడానికి మరియు తగిన చర్యలు తీసుకోవడానికి ఈ సంవత్సరం యొక్క థీమ్ అందరం కలిసి సవాల్ విసురుదాం అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు.  క్యాన్సర్ సంరక్షణలో ఆరోగ్య అసమానతలను తొలగించాలని ప్రపంచ నాయకులను కోరుతూ మరియు వారి మూల కారణాన్ని పరిష్కరించాలని. క్యాన్సర్ చికిత్సలో వ్యాధిని ముందుగా గుర్తించడం, తగిన సమయంలో చికిత్స తీసుకోవడం మరియు మానసిక ప్రేరణ అనేది చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 10 లక్షల మందికి పైగా క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. అంతే కాకుండా, మరణాల జాబితాలో క్యాన్సర్ రెండవ ప్రధాన కారణం. వర్ధమాన దేశాలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దేశాల్లో పది మరణాల్లో ఏడు మరణాలు కేన్సర్ కారణంగా సంభవిస్తుండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాలలో 40 శాతానికి పైగా జీవనశైలి మార్పులు, రెగ్యులర్ చెకప్‌లు మరియు ముందస్తుగా గుర్తించడం మరియు చికిత్స చేయడం ద్వారా నివారించవచ్చు.శరీరంలో ఏదైనా అవయవానికి కేన్సర్ సోకితే తొలిదశలో లక్షణాలు అంతగా కనిపించవు. వ్యాధి సోకిన అవయవాన్ని బట్టి దీని నిర్ధరణ పరీక్షలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల క్యాన్సర్లనూ ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు. క్యాన్సర్ అంటువ్యాధికాదు. అలాగే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం కూడా తక్కువే. అయితే, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పాంక్రియాస్ క్యాన్సర్లు జన్యుపరంగా సంక్రమిస్తాయి. కుటుంబంలో ఎవరికైనా ఈ కేన్సర్లు వస్తే వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకూ వ్యాపించి, చికిత్సకు సైతం ఏమాత్రం తగ్గుముఖం పట్టవు. కాబట్టి దీనిపై అవగాహనతో ఎదుర్కొవాలి.పిల్లలకి వారి హద్దులు గురించి ఇలా చెప్పండికేన్సర్‌కు కారణాల్లో ఆధునిక జీవన శైలి ప్రధానమైంది. మద్యం, పొగతాగడం, ఆహారపదార్థాల్లో రంగులు వినియోగం, రసాయనాలు వాడటం, హార్మోన్లు అధికంగా వాడటం, అధిక బరువు, కాలుష్యం, క్రిమిసంహారకాలు, చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్‌కు గురికావడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు.. ఇవన్నీ క్యాన్సర్‌కు కారకాలు. కొన్ని రకాల కేన్సర్లను రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. వాటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌‌కు ప్రధాన కారణం హెచ్‌పీవీ వైరస్. కాబట్టి దీనికి వ్యాక్సిన్ వేసుకుని నివారించవచ్చు. 9 ఏళ్లు పైబడిన బాలికల నుంచి 40 ఏళ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అలాగే అండాశయం, గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది.క్యాన్సర్ కణం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కేన్సర్‌ను తొలి దశలోనే గుర్తించడం, దానికి ఇతర అవయవాలకు విస్తరించే గుణం ఉందా అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. సర్జరీ, మందులు, థెరపీలు కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. క్యాన్సర్‌ను జయించడం, త్వరగా గుర్తించడంతో పాటు ఆ కణితులు పరిమాణం, దశ, గ్రేడింగ్ కూడా చాలా ముఖ్యం. కాన్సర్‌కు వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారూ దీని బారిన పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లను చాలా వరకు పూర్తిగా నయం చేయగలిగినవే. అయితే, వయస్సు పెరిగేకొద్ది కేన్సర్స్ వచ్చే ముప్పు ఎక్కువ. ఈ సమయంలో వచ్చే కేన్సర్ల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

అందుకే కేన్సర్ చికిత్సను కూడా వయస్సును బట్టి నిర్ధరిస్తారు. క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేయడానికి కీమోథెరఫీ, రేడియోథెరఫీలతో పాటు ల్యాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీహోల్ సర్జరీలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. సర్జరీ తర్వాత రేడియో, కీమో, హార్మోన్ థెరఫీ లాంటివి చేసినా, లేక థెరఫీల తర్వాత సర్జరీ చేసినా చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.క్యాన్సర్ కణం శరీరంలో ఎక్కడుందనే విషయం తెలుసుకోవడం కష్టం. ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేర్వేరుగా ఉంటాయి. వీటిలో బయాప్సీ, యఫ్‌యన్‌ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్-రే, సీటీ స్కాన్, యంఆర్‌ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారు. అయితే సర్వైకల్ క్యాన్సర్‌ను పాప్‌స్మియర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు.

About Author