PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యాభివృద్ధిలో..‘మలబార్​’ కృషి..భేష్​..

1 min read

నగర మేయర్​ బి.వై. రామయ్య

  • కేవీఆర్​ కళాశాలలో 215 మంది విద్యార్థినులకు స్కాలర్​షిప్​ పంపిణీ

కర్నూలు, పల్లెవెలుగు:భారతదేశంలో అతిపెద్ద బంగారు మరియు వజ్రాభరణాల వ్యాపార సంస్థలలో ఒకటైన మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ…. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు కర్నూలు నగర మేయర్​ బి.వి. రామయ్య. బుధవారం కర్నూలు కేవీఆర్​ కళాశాలలో 215 మంది విద్యార్థినులకు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ సంస్థ తరుపున స్కాలర్​షిప్​ల పంపిణీ చేశారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా నగర మేయర్​ బి.వై. రామయ్య , జిల్లా డి.వి.ఈ.ఓ జమీర్​ పాష, ఐసీడీఎస్​ పీడీ వెంకకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్​ రామయ్య మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మలబార్​ గోల్డ్​ అండ్ డైమండ్స్​ సంస్థ అని,  పేద విద్యార్థినులకు స్కాలర్​షిప్​ ఇస్తూ.. విద్యాభివృద్ధి కృషి చేయడం ప్రశంసనీయమన్నారు. అనతరం కర్నూలు షోరూమ్​ స్టోర్​హెడ్​ ఫయాజ్​, అసిస్టెంట్​ స్టోర్​ హెడ్​  సమీర్​, మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​ వుల్లా మాట్లాడుతూ  ప్రతిభ ఆధారంగా 215 మంది విద్యార్థినులను గుర్తించామని, ఒక్కొక్కరికి రూ. 8వేలు నుంచి రూ.10వేలు చొప్పున  రూ.18,46,000 మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశామన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్​లో  5,500 మంది  పేద విద్యార్థినులను ఎంపిక చేసి రూ. 8వేల నుంచి రూ.10వేల వరకు స్కాలర్​షిపులు అందిస్తామని ఈ సందర్భంగా  మలబార్​ గ్రూపు ప్రకటించిందని తెలిపారు. పేద విద్యార్థులను విద్యలో ప్రోత్సహించాలన్న లక్ష్యంతో తమ సంస్థ  స్కాలర్​ షిప్​లు అందజేస్తుందన్నారు. మలబార్​ గ్రూపు నిబద్ధతలో భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలకు, దాతృత్వ కార్యకలాపాలకు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ లాభాలలో 5శాతం  ఈ ప్రాంతంలో ఖర్చు పెడుతుందన్నారు.  మలబార్​ గ్రూపు సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా  గృహ నిర్మాణం, వైద్యసహాయం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత మరియు  విద్యారంగంలో దృష్టి సారిస్తుందని, గత 20 ఏళ్లుగా మలబార్​ గ్రూపు వారే  మలబార్​ ఛారిటబుల్​ ట్రస్ట్​ రూ.38.32 కోట్లు పైగా వైద్య సహాయం కోసం వెచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేవీఆర్​ కళాశాల విద్యార్థినులు, మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ కర్నూలు బ్రాంచ్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author