PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పీఎం కిసాన్​‘కు .. ఈకేవైసీ తప్పనిసరి..

1 min read

జిల్లా వ్యవసాయ అధికారి పిఎల్​ వరలక్ష్మి

పల్లెవెలుగు:రైతుల సంక్షేమార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయని, వాటిని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి పి.ఎల్​.వరలక్ష్మి. పీఎంకిసాన్​ పథకం కింద జిల్లాలో 27,607 మందికి 13వ విడత కింద నగదు జమ అయిందని, కానీ వారందరూ ఈకేవైసీ చేయించుకోలేదని బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. నగదు జమ అయినా…ఈకేవైసీ చేయించుకోని వారి జాబితాను రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించామని, జాబితా నందు రైతుల ఆధార్​ సంఖ్యను  కూడా పొందుపరిచామన్నారు.  రైతులు జాబితాలో తెలిపిన వివరాలను  సరి చూసుకుని ఈకేవైసీ తప్పక చేయించుకోవాలని సూచించారు. లేదంటే 14వ విడత నగదు జమ కాదని ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పిఎల్​ వరలక్ష్మి వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ లోపు ఈకేవైసీ చేయించుకోవాలని రైతులకు సూచించారు.

About Author