PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు

1 min read

పల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ కు గాయాలయ్యాయి. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ జిల్లాలో ఇమ్రాన్ ఖాన్ నేడు ర్యాలీ నిర్వహించారు. ఆయన ఓ కంటైనర్ వాహనంలో ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్ కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు.

About Author