PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగుదేశం పార్టీలో చేరిన మ‌హేష్ బాబు అభిమానులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూలు న‌గ‌రంలోని సూప‌ర్ స్టార్ క్రిష్ణ‌, మ‌హేష్ బాబు అభిమానులు క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్‌కు మ‌ద్ద‌తు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. మౌర్య ఇన్‌లో వీరు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ మహేష్ బాబు అభిమానులు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. కుల‌,మ‌తాల‌కు అతీతంగా హీరోలను అభిమానించినట్లే.. ప్రజాసేవ చేసే త‌న‌ను కూడా కుల‌,మ‌తాల‌కు అతీతంగా ఎన్నుకోవాల‌ని కోరారు. సూపర్ స్టార్ క్రిష్ణ‌, మ‌హేష్ బాబు అభిమానుల‌కు తాను అండ‌గా ఉంటానని హామీ ఇచ్చారు. స్టార్ హీరోల సినిమా విడుద‌ల స‌మ‌యంలో రాజ‌కీయాలు చేస్తున్నార‌ని.. టికెట్ల విష‌యాన్ని పూర్తిగా ఫ్యాన్స్‌కే వ‌దిలేయాన్నారు. రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల అభిమానులు కొట్టుకునే ప‌రిస్థితులు వ‌చ్చాయ‌న్నారు. ఇక క‌ర్నూల్లో యువ‌త‌కు ఉద్యోగాలు ఎంతో అవ‌స‌ర‌మ‌న్నారు. తన‌ను గెలిపిస్తే క‌ర్నూలుకు ప‌రిశ్రమ‌లు తెచ్చి యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి 3 నెల‌ల నుండి 6 నెల‌ల‌కు ఒక‌సారి జాబ్‌మేళా నిర్వహిస్తాన‌ని పేర్కొన్నారు. యువ‌త అంద‌రిలో చైత‌న్యం తీసుకురావాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో అభిమానులు అహ్మద్‌, సురేష్‌, ర‌వి కుమార్, స‌మీర్, మ‌ధు, స‌లీం, రెడ్డి, జావీద్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author