NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా బడేటి చంటి పేరు ఖరారు..

1 min read

పొత్తులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన

ఇరువురి అధినేతలు సంయుక్తంపై నిర్ణయం

ఏలూరులో టిడిపి వర్గ నేతలు సంబరాలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు అసెంబ్లీ నియోజక వర్గ టి డి పి అభ్యర్థిగా బడేటి చంటి  పేరు ను పొత్తులలో భాగం గా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ప్రకటించారు.ఏలూరు టి డి పి కి కేటాయించడం ఎం ఎల్ ఏ అభ్యర్థిగా చంటి పేరు ప్రకటించగానే ఏలూరు టి డి పి వర్గాలు సంబరాలు జరుపుకున్నాయి.టి డి పి నాయకులు ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు.కొన్నాళ్లుగా ఏలూరు అసెంబ్లీ స్థానం టి డి పి కా జనసేనకా అనే ఉత్కంఠత నగర ప్రజల నరాలను తెంపింది. శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్.టి డి పి అధినేత చంద్రబాబు నాయుడు గత రెండురోజులుగా సమాలోచనలు చేసి ఏలూరు  అభ్యర్థి నిర్ణయం పై ఇరువురు అధినేతలు సంయుక్త  నిర్ణయం తీసుకుని చివరకు బడేటిచంటి పేరు ను ప్రకటించారు.ఏలూరు సీటు పై ఎన్నో ఆశలు పెంచుకున్న జనసేననాయకులకు ఇరువురు అధినేతలుకలిసి తీసుకున్న నిర్ణయం నూరుత్సా హాన్ని మిగిల్చింది.జనసేన.టి డి పి లు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏలూరు అసెంబ్లీ సీటు టి డి పి నుండి బడేటి కిచ్చినా.లేదా జనసేన నుండి రెడ్డి అప్పలనాయుడు కిచ్చినా  ఉమ్మడి అభ్యర్థి ని గెలిపించుకోవడానికి ఏలూరు అసెంబ్లీ  జనసేన టి డి పి ముఖ్య నేతలు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఎన్నికల కసరత్తు కు పదును పెట్టె ప్రయత్నం లో నిమగ్నమయ్యారు.

About Author