PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫోర్టిఫైడ్ బియ్యం గర్భిణీ స్త్రీలకు .. రక్తహీనత నివారణకు ఉపయోగం

1 min read

– సాధారణ బియ్యానికి విటమిన్లు, ఖనిజాలను జోడించడం ద్వారా రూపొందించిన  ఫోర్టిఫైడ్ బియ్యం గర్భిణీ స్త్రీలకు మరియు బాల బాలికలలో రక్తహీనత నివారించుట కొరకు చాలా ఉపయోగపడుతుంది

– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య

పల్లెవెలుగు వెబ్  కర్నూలు: సాధారణ బియ్యానికి విటమిన్లు, ఖనిజాలను జోడించడం ద్వారా రూపొందించిన  ఫోర్టిఫైడ్ బియ్యం గర్భిణీ స్త్రీలకు మరియు బాల బాలికలలో రక్తహీనత నివారించుట కొరకు చాలా ఉపయోగపడుతుందని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు. శనివారం  స్థానిక ప్రభుత్వ టౌన్ మోడల్ పాఠశాల నందు పోర్టీపైడ్ బియ్యం, మిల్లెట్స్ తో తయారు చేసిన  వివిధ రకాల వంటకాల ఫుడ్ స్టాల్ కార్యక్రమంలో  జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ బియ్యానికి విటమిన్లు, ఖనిజాలను జోడించడం ద్వారా రూపొందించిన  ఫోర్టిఫైడ్ బియ్యం గర్భిణీ స్త్రీలకు మరియు బాల బాలికలలో రక్తహీనత నివారించుట కొరకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా పోర్టీపైడ్ బియ్యం నుండి ఎన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు వాటి వల్ల ఎటువంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాన్ని ప్రజలలో అవగాహన కలిగించేందుకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశమని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.  పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్  ఆహార భద్రత చట్టం కింద బియ్యము, గోధుమపిండి, చక్కెర, దాల్  ఇవ్వడం జరుగుతుందని కొత్తగా  టేక్ హోమ్ రేషన్ కిట్స్ కింద  రాగి, అటుకులు, ఖర్జూర ఇచ్చే వాళ్ళమని వాటికి అదనంగా  గత నెల నుండి 3 కేజీల బియ్యం, దాల్, ఆయిల్ కూడా  గర్భిణీ స్త్రీలు, లాక్టేటింగ్ మహిళలు, రక్తహీనతతో ఉన్న స్త్రీలకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడి సెంటర్ల ద్వారా తీసుకుంటున్న టేక్  హోమ్ రేషన్ కిట్లు అయిన, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం ద్వారా తీసుకుంటున్న బియ్యం అయినా , మిడ్ డే మీల్స్ కింద, హాస్టల్ కి అందిస్తున్న సంబంధిత బియ్యం అయినా డైవర్ట్ చేయకుండా దేనికైతే ఇస్తున్నామో వాటికే ఉపయోగించే విధంగా చూసుకోవాలని ఎందుకంటే కొన్ని ప్రదేశాలలో డైవర్షన్ ఎక్కువగా జరుగుతుందనే విషయం మా దృష్టికి వచ్చిందని ఇటువంటి పనులు చట్టరీత్యా నేరమైన  పనులని కమోడిటీస్  యాక్ట్  కింద కేసులు బుక్ చేయవచ్చునని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఫుడ్ స్టాల్ నందు దాదాపుగా 50 రకాల పైగా వంట పదార్థాలను చేశారని, టేక్ హోమ్ రేషన్ కిట్స్ కింద  గర్భిణీ స్త్రీలకు ఇస్తున్న కిట్లను వారు ఒకవేళ చేసుకోలేకపోతే అంగన్వాడి సెంటర్ లోనే వండించి వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుందని అంగన్వాడి వర్కర్లకు  సూచించారు. కార్యక్రమం ముందుగా ఐసిడిఎస్ అంగన్వాడీ వర్కర్లు ఫుడ్ స్టాల్ నందు పోర్టీపైడ్ బియ్యం, మిల్లెట్స్ తో తయారు చేసిన   50 రకాల పైగా వంట పదార్థాలను రుచి చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.కార్యక్రమం తదనంతరం వంటలు బాగా చేసిన ముగ్గురు ని ఎంచుకొని జాయింట్ కలెక్టర్ బహుమతులు అందచేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లైస్  డిఎమ్  షర్మిల, ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మమ్మ, డీఎస్ఓ ఆచార్యులు అంగన్వాడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author