PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల భవిష్యత్​కు.. ‘భాష్యం’ భరోసా: ప్రిన్సిపల్​ వాణి

1 min read

భాష్యం ఇంట్రా స్పోర్ట్స్ రంభం

పల్లెవెలుగు వెబ్​, నంద్యాల:విద్యార్థుల బంగారు భవిష్యత్​కు భాష్యం స్కూలు భరోసా ఇస్తుందన్నారు ప్రిన్సిపల్​ వాణి. పిల్లల మేధాశక్తి పెంపొందించడం, క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వడం స్కూలు ప్రత్యేకత అన్నారు. శుక్రవారం పద్మావతి నగర్​ స్టేడియంలో భాష్యం పాఠశాల ఇంట్రా స్పోర్ట్స్​ నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్​ రవి కృష్ణ, డీసీడీఓ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్​ వాణి మాట్లాడుతూ భాష్యం స్కూల్ పిల్లల మనోవికాసానికిచదువుతోపాటు ఆటలు కూడా ముఖ్యమని మన భాష్యం స్కూలు పిల్లలను  చదువు మరియు ఆటపాటలలో అన్ని రంగాలలో ముందు ఉంచేదానికి ప్రయత్నిస్తుందని తెలిపారు.ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని శారీరక దారుఢ్యం కలిగి ఉండాలని మరియు జోనల్ లెవెల్లో జరిగే ఇంట్రా స్పోర్ట్స్ మీట్ లో నంద్యాల బ్రాంచ్ ను  ప్రథమ స్థానంలో నిలపాలనిి తెలిపారు.ఈ కార్యక్రమంలో భాష్యం ZEO అనిల్ గారు,PET రాజాచక్రవర్తి,ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర బృందం మరియు  విద్యార్థులందరూ పాల్గొని విజయవంతం చేశారు.

About Author