PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవం.. మణికంఠుడి గ్రామోత్సవం..

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు:  కడప జిల్లా చెన్నూరు మండలంలోని రామనపల్లెలో ఆదివారం సాయంత్రం అయ్యప్పస్వామి భక్తులు మణికంఠుని గ్రామోత్సవం అంగరంగ వైభవంగాగురుస్వామి  జ్యోతి రెడ్డి రమణారెడ్డి శిష్య బృందం గ్రామపెద్దలు నిర్వహించారు. కార్తీకమాస బహుళ నవమి లో భాగంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ  కార్యక్రమం, శ్రీ గౌరీ మల్లేశ్వర ఆలయం నుండి రామన పల్లె పురవీధులలో అయ్యప్ప స్వామి భక్తులు, కన్య స్వాములు  పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి మణికంఠుని 12వ గ్రామోత్సవం సందర్భంగా, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు గావించారు, మధ్యాహ్నం స్వాములు వారితో పాటు గ్రామ ప్రజలకు అన్నదానం( బిక్ష) గావించారు ,మణికంఠుని పూలతో ప్రత్యేక అలంకరణ గావించారు, అనంతరం స్వామివారిని  పురవీధుల్లో ,డ్రమ్స్ కోలాటం తో ఊరేగింపుగా తీసుకు రావడం జరిగింది, గ్రామ ప్రజలందరూ స్వామి వారిని దర్శించుకొని స్వామివారికి కాయ కర్పూరం అందజేశారు.

About Author