PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీఓ 117 సవరణ చేయాలని… 8న ‘డీఈఓ’ ముట్టడి :ఫ్యాప్టో

1 min read

పల్లెవెలుగు వెబ్​: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 117 జీఓను వెంటనే సవరించాలని డిమాండ్​ చేస్తూ… ఈనెల 8న ఫ్యాప్టో ఆధ్వర్యంలో  డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలు జిల్లా ఎస్టియు కార్యాలయం లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఫ్యాప్టో కార్యనిర్వాక సమావేశం మధుసూదన్ రెడ్డి మరియు గట్టు తిమ్మప్ప ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆప్త రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ఫ్యాప్టో కో చైర్మన్ కాకి  ప్రకాష్ రావు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్ 117 వలన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తీవ్రస్థాయిలో తగ్గిపోతుందని దానికి ముఖ్య కారణం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిలో అంతకు మునుపు 1 20 ఉన్నదాన్ని 1: 30 గా మార్చడం వలన భారీ స్థాయిలో ఉపాధ్యాయుల పోస్టులు తగ్గిపోయి ఉన్నవారిపై భారం పడడం మరియు ప్రాథమిక స్థాయిలో ఎకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడటానికి కారణం అవుతుందని, అన్ని ఉపాధ్యాయ సంఘాలు దీన్ని వ్యతిరేకించి మంత్రి గారి సమావేశంలో తమ యొక్క అసంతృప్తిని తెలియజేసిన దానిపై ఎటువంటి మార్పులు చేయకుండా అధికారులు ఉత్తర్వుల అమలుకు ముందుకు  వెళుతున్నందున ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలకు మరియు  ప్రజా ప్రతినిధులకు ఈ ఉత్తర్వువలన జరగబోయే నష్టాన్ని తెలియజేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాల సమర్పణ ఫ్యాప్టోలో ఉన్న 12 సభ్య సంఘాలు మరియు కలిసి వచ్చే సంఘాలతో చేయాలి అన్నారు. అనంతరం  సమావేశం అధ్యక్షత వహించిన డిటిఎఫ్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప మాట్లాడుతూ రేపు అన్ని తాలూకా కేంద్రాల్లో సన్నాక సమావేశాలు నిర్వహించాలని   సమావేశాల నిర్వహణకు తాలూకా బాధ్యత వహించిన సంఘాలు సభ్య సంఘాలు అన్నిటిని సమన్వయం పరుచుకుని   సమావేశం నిర్వహించాలి మరియు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పణ జరుపవలెనని కోరారు ఆప్త కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీ మునగాల మధుసూదన్ రెడ్డి గారు ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ మరియు విద్యార్థి నిష్పత్తిలో పెంపుదల చేయడము తగదు అన్నారు. కర్నూలు జిల్లా ఎస్టియు అధ్యక్షులు శ్రీ గోకారి గారు మాట్లాడుతూ బదిలీల యందు కౌన్సిలింగ్ అనే విధానాన్ని ఉపాధ్యాయ సంఘాలు పోరాడి సాధించుకున్నాయి ,దాన్ని తూట్లు పొడిచే విధంగా అక్రమ పద్ధతిలో బదిలీ జరగడాన్ని ఉపాధ్యాయ సంఘాలు ఒప్పుకోవు అన్నారు. కర్నూలు జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులు ఎల్లప్ప గారు ప్రాథమిక పాఠశాల లోని మూడు నాలుగు ఐదు తరగతులను సౌకర్యాలు లేకున్నప్పటికీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు వాటిని వెంటనే ఆపాలి. మూడు నాలుగు ఐదు తరగతుల చిన్నారులు కిలోమీటర్ దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులకు గురవుతారు అందుకు ఉదాహరణగా గూడూరు మండల కేంద్రంలో తల్లిదండ్రులు చేసిన ఆందోళన చెప్పుకోవచ్చు అన్నారు ఈ పాఠశాల విలీనంపై సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించాలి . ఈ విలీన కార్యక్రమం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నమోదు తగ్గిపోయే ప్రమాదం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీ జయరాజు, ఎస్ టి యు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ టి కే జనార్ధన్, ప్రధానోపాధ్యాయ సంఘం కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి వై నారాయణ ,ఏపీటీఎఫ్ 1938 నాయకుడు కే జనార్దన్ రెడ్డి, రూట కర్నూలు జిల్లా అధ్యక్షుడు మోహిన్ మరియు దాదా పీర్, బి టి ఏ కర్నూలు జిల్లా ఆర్థిక కార్యదర్శి ఏ నాగార్జున ,నంద్యాల జిల్లా ఎస్టియు అధ్యక్షుడు కే వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా ఏపీటీఎఫ్ 257 అధ్యక్షుడు కేవీ శివయ్య కర్నూలు జిల్లా ఏపీటీఎఫ్ నాయకుడు ఎం రామతుల్లా బేగ్ ,డి టి ఎఫ్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ కే కిషోర్ పాల్గొనడం జరిగింది.

About Author