PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్లవేళల దేవుని ఆశీస్సులు ఉంటాయి : బిషప్ జయరావు పొలిమేర   

1 min read

పల్లెవెలుగు వెబ్​:ఈస్టర్ పండుగ సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్  ఏలూరు రోమన్ క్యాథలిక్ డయాసిస్ లో ఏలూరు పీఠాధిపతులు బిషప్ హౌస్  మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమేరని కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా బిషప్ హౌస్ నందు  కేక్ కటింగ్ వేడుకల్లో  కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ పాల్గొన్నారు. అనంతరం అమలోద్భవి మాత దేవాలయంలో  ఈస్టర్ ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా జిల్లా అబివృద్దికి కృషి చేస్తున్న  జిల్లా కలెక్టర్ వారికి బిషప్ పొలిమేర జయరావు ప్రత్యేక ప్రార్ధనలతో అశీస్సులు అందజేశారు.ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్ జి మోజెస్,రెవరెండ్ ఫాదర్ పి బాల,ఫాదర్ ఫిలిప్స్, పాదర్ బి. రాజు, ఫాదర్ అమన్ రాజ్, ఫాదర్ ఐ మైకేల్,ఫాదర్ స్టీవెన్ తదితరులు పాల్గొన్నారు.

About Author