PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ఫ్రీ సీట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్, ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో ఉక్రెయిన్‌లో వైద్య విద్యలాంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన భారత విద్యార్థులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి రప్పిస్తోంది. విద్యార్థులు ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇండియాకు చేరుకున్నప్పటికీ వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి వచ్చిన భారత విద్యార్థులకు యూఏఈ యూనివర్సిటీలు తీపి కబురు చెప్పాయి. తమ యూనివర్సిటీల్లో చదువును కొనసాగించేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపాయి. ముఖ్యంగా తమ యూనివర్సిటీకి చెందిన అడ్మిషన్ కౌన్సెలర్లు.. విద్యార్థులు సాఫీగా బదిలీ అయి తమ కోర్సు పూర్తి చేయడానికి, వీసా, వసతి సౌకర్యాలు పొందేందుకు సహాయ సహకారాలు అందజేయనున్నట్టు గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. యూనివర్సిటీ ఫౌండర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ డాక్టర్ తంబి మొయిదీన్మాట్లాడుతూ.. ‘క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తోటి భారతీయులకు సహాయం చేయడం భారతీయుడిగా నా కర్తవ్యం. చదువు మధ్యలో ఆపేసి ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన విద్యార్థులు తమ కలలను సహకారం చేసుకునేందుకు సహాయం అందిస్తాం’ అని పేర్కొన్నారు.

                                     

About Author