PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ , సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో నియమించనున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విజయనగరంలోని వైద్య ఆరోగ్య శాఖలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నీరు. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా క్షయ నియంత్రణ కార్యాలయములో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ల్యాట్ టెక్నీషియన్, సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్ వైజర్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్ వైజర్ వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్‌టీఈపీ ప్రోగ్రాంలో భాగంగా కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను తీసుకోనున్నారు. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో 04 పోస్టులు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నాయి. రెండు పోస్టుల జనరల్ కింద కేటాయించగా.. ఒక పోస్టు దివ్యాంగులకు, మరో పోస్టు బీసీ బీ మహిళకు కేటాయించారు. అభ్యర్థులు అర్హతల విషయానికి వస్తే.. ఇంటర్, డిగ్రీ, డీఎంఎల్‌టీ, సర్టిఫికెట్ కోర్సు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. పోస్టుల ఆధారంగా ఈ అర్హతలు మారుతాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 17, 2022లోగా.. జిల్లా క్షయ నియంత్రణ అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,019 నుంచి రూ.33,975 చెల్లించనున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలకు https://vizianagaram.ap.gov.in/notice_category/recruitment/ను సందర్శించొచ్చు. ఈ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

About Author