PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

`ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ట్విట్ట‌ర్ రివ్యూ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్‌గా వస్తోన్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఇపుడు ఓ అందమైన ప్రేమకథ తెరకెక్కించాడని తెలుస్తోంది. ఒక్కసారి ఇంద్రగంటి ఎవరైనా హీరోతో కనెక్ట్ అయ్యాడు అంటే వరసగా ఆయనతోనే సినిమాలు చేస్తుంటారు. సుధీర్ బాబు ఇప్పుడు ఆయనకు అలాగే కనెక్ట్ అయ్యాడు. 4 ఏళ్ళ కింది ఈ కాంబినేషన్‌లో మొదటిసారి సమ్మోహనం సినిమా వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ సున్నితమైన ప్రేమకథకు మంచి అప్లాజ్ రావడమే కాకుండా విజయం కూడా అందుకుంది. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన 25వ సినిమా ‘వి’లో కూడా సుధీర్ బాబు మరో హీరోగా నటించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

                                                  

About Author