PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్​ కడప : సినీ నటుడు నందమూరి తారక రామారావు(జూనియర్ ఎన్టీఆర్ )జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కడప నగరం పాత రిమ్స్ వద్దగల ఆదరణ నిరాశ్రయుల వసతి గృహంలో శనివారం ఉదయం తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ పి, రామారావు యాదవ్, పెద్ద బుద్ధి వెంకట శివప్రసాద్ ఆధ్వర్యంలో తారక్ 41 పుట్టినరోజు కేక్ కట్ చేసి అనంతరం అల్పాహార కార్యక్రమము చేపట్టడం జరిగింది, ఈ సందర్భంగా ఫాన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు పి, రామారావు యాదవ్, మాట్లాడుతూ సినీ వినీల ఆకాశంలో ఒక పెద్ద స్టార్ గా వెలుగొందటమే కాకుండా, ఆయన అభిమానులకు కొండంత అండగా నిలబడడం జరిగింది, అందుకే ఆయనను అభిమానులందరూ ముద్దుగా చిన్న రామయ్య, తారక్ అని పిలుచుకుంటారని ఆయన తెలియజేశారు, ఆయన ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ పది కాలాలపాటు చల్లగా ఉండాలని అభిమానులు అందరము కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నామని ఆయన అన్నారు. రాబోయే దేవర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి శ్రీను, అనూష యాదవ్, అది కేశవరెడ్డి,, మంజునాథరెడ్డి, సుబ్బారెడ్డి,సుదర్శన్ యాదవ్,సురేంద్ర యాదవ్, మల్లి యాదవ్, అజయ్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, రాజు యాదవ్, మోహన్, విక్రమ్, రాంమోహన్ యాదవ్, గంగాధర్ యాదవ్, అరుణ్ కుమార్ యాదవ్, డాన్ సూరి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

About Author