PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు  వెబ్ మంత్రాలయం : నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో  ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర సర్కిల్ లో వైకాపా మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, ఇన్చార్జ్ సి. వి. విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో వంద సంవత్సరాలు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహ మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, జనార్దన్ రెడ్డి, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ ల హోటల్ పరమేష్, వీరారెడ్డి, చెట్నహల్లి సర్పంచ్ ఆంజనేయులు, ఉప సర్పంచి వీరానాగప్ప, ఎంపిటిసి సభ్యులు రామాంజనేయులు వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.చిలకలడోన లో కస్తుర్బా లో విద్యార్థులకు ప్రోత్సాహకలు : – మండల పరిధిలోని చిలకలడోన కస్తుర్బా పాఠశాల లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి జన్మదిన వేడుకలు సందర్భంగా పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ధరణి 516 మార్కులు, ఇందు 475 మార్కులు సాధించడం తో ధరణి కి రూ 3 వేలు, ఇందుకు రూ 2 వేలు ప్రోత్సాహకలను వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య,జనార్దన్ రెడ్డి, రాఘవేంద్ర, కస్తుర్బా ప్రిన్సిపాల్ శాంతి తదితరులు ఉన్నారు.

About Author