PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ ఆదర్శ మహిళలకు ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: అన్నమయ్య జిల్లా మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ అద్వర్యములో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ మతి శ్రీ ధనలక్ష్మి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఆదర్శ మహిళ గా శ్రీ మతి శ్రీ మౌనిక టైలరింగ్ నందు నైపుణ్యం కలిగి జీవితం లో అనేక సమస్యలను ఎదుర్కొంటు ఒక వైపు కుటుంభ బాద్యతలు మోస్తు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెంచుకొంటు ఆర్థికంగా ఎదుగుతూ తన ద్వారా కొంత మంది మహిళ లకి ఉపాధి కల్పిస్తు పదిమందికి ఆదర్శంగా నిలుస్తున్న స్త్రీ మూర్తి కి ఘనం గా సన్మానించి మెమొంటో తో సత్కరించారు. ఈ సందర్భంగా గా ప్రాజెక్టు డైరెక్టర్ ధనలక్ష్మి మేడం మాట్లాడుతూ మౌనిక తన టైలరింగ్ వృత్తి ద్వారా మహిళలు ను అందంగా తీర్చి దిద్దడమే కాకుండా తన జీవితాన్ని కూడా అద్భుతం గా మలుచుకొంటుంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author