NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దండ‌కారణ్యంలో పేలిన తుపాకీ

1 min read

ఛత్తీస్​ఘడ్​ : ఛత్తీస్​ఘడ్​ లో భారీ ఎనౌకౌంట‌ర్ జ‌రిగింది. మావోయిస్టుల‌కు, భ‌ద్రతా బ‌ల‌గాల‌కు మ‌ధ్య భీక‌ర‌పోరు న‌డిచింది. ఈ కాల్పుల్లో ఐదుగురు జ‌వాన్లు మృతి చెంద‌గా.. 30 మంది గాయ‌ప‌డిన‌ట్టు స‌మాచారం. చాలా మంది జ‌వాన్లు గ‌ల్లంత‌య్యారు. మ‌రోవైపు ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన‌ట్టు స‌మాచారం. మావోయిస్టుల వైపు కూడ ఇంకా ప్రాణ న‌ష్టం అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. బీజాపూర్-సుకుమ జిల్లాల స‌రిహ‌ద్దుల్లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. త‌రెం, జోన‌గూడ‌, సిల్గోర్ అట‌వీ ప్రాంతాల్లో 2000 మంది భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌తో గాలింపు నిర్వహిస్తున్నారు. మూడు ప్రాంతాల్లో ఏక‌కాలంలో గాలింపు నిర్వహిస్తున్న సంద‌ర్భంలో.. త‌రెం అట‌వీ ప్రాంతంలో 400 మంది భ‌ద్రత సిబ్బంది మీద మావోయిస్టులు దాడి చేశారు. వెంట‌నే తేరుకున్న భ‌ద్రత సిబ్బంది కూడ ఎదురు దాడి చేశారు.

About Author