PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా బి.వీరభద్ర గౌడ్ జన్మదిన వేడుకలు

1 min read

నిర్వహించిన ఆలూరు తెలుగు తమ్ముళ్లు

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి.వీరభద్ర గౌడ్  జన్మదిన వేడుకలను ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించడం జరిగింది ముక్యంగా ఆలూరు తాలూకా టిడిపి నాయకులు,కార్యకర్తలు ఆలూరు బెళ్లేగుండుఆంజనేయ స్వామి సర్కిల్ నుండి దాదాపు 1000 ద్విచక్రవాహనాలతోబి.వీరభద్ర గౌడ్ కి ఆలూరు పట్టణంలోకి భారీ ఎత్తున స్వాగతం పలికారు. అలాగే ఆలూరు అంబేద్కర్ సర్కిల్ లో మరియు ఆలూరు టిడిపి  ఆఫీసు దగ్గర దాదాపు 6వేల మంది టిడిపి నాయకులు, కార్యకర్తలు క్రేన్ ల సహాయంతో గజమాలలను అలంకరించి. కేక్ కూడా కట్ చేశారు.అలాగే బి.వీరభద్ర గౌడ్  ఆలూరు బస్టాండ్ సర్కిల్ లో శ్రీ.వాల్మీకి మహర్షి విగ్రహానికి మరియు డా. బి.ఆర్​.   అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు, వేసి నివాళులర్పించారు,ఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ ఆరు మండలాల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,వివిధ హోదాలలో ఉన్న టిడిపి జనసేన BJP నాయకులు అలాగే ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న టిడిపి నాయకులు,కార్యకర్తలు మరియు తెలుగుయువత, Itdp,Tnsf,Tntuc మరియు నందమూరి,నారా,BVG అభిమానులు,మహిళా సంఘాల నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున,భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *