PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాకర్ల శీనుకి జన్మదిన శుభాకాంక్షలు..

1 min read

శుభాకాంక్షలు తెలిపిన కుటుంబ సభ్యులు, అభిమానులు, సంఘ నాయకులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : సినీ కార్మిక, ఏలూరు భవన నిర్మాణ కార్మిక, సంఘాల అధ్యక్షులు  కాకర్ల శ్రీను కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పలువురు సంఘ నాయకులు, స్నేహితులు, బంధుమిత్రులు స్వయంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫోనుల ద్వారా మరి ఎంతోమంది జన్మదిన శుభాకాంక్షలు కాకర్ల శీనుకి తెలియజేశారు. మంచి మనిషి, సహృదయుడు, పది మందికి సేవ చేసే గుణం గలవాడు, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో, ప్రజల మనిషిగా, ప్రజా సేవకుడుగా, రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాల అధిరోహించాలని మనస్ఫూర్తిగా పలువురు స్నేహితులు, బంధుమిత్రులు, సంఘ నాయకులు కోరుకుంటున్నారు. తన సేవాగుణంతో ఆయన ఏలూరు నగరంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించి, అడిగిన వారికి తనకున్న దానిలో తన వంతు సహాయ సహకారం అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. పెద్ద ఎత్తున పలువురు ఆయన నివాసానికి, కార్యాలయానికి చేరుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author