PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నగర మేయరుకు జన్మదిన శుభాకాంక్షలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగర మేయర్​, వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరి జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మరియు కర్నూలు మున్సిపల్ కమిషనర్ డి.కే బాలాజీ ఫోన్ ద్వారా మేయరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మున్సిపల్ అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, వైయస్ఆర్ సిపి కర్నూలు నగర అధ్యక్షులు రాజవిష్ణువర్ధన్ రెడ్డి, 49వ వార్డు కార్పొరేటర్ సోంపల్లి కృష్ణాకాంత్ రెడ్డి, వైయస్ఆర్ సిపి బి.సి విభాగం ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, వైయస్ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ నాయకులు కటారి సురేష్, 1వ వార్డు కార్పొరేటర్ షాషావలి, 17వ వార్డు కార్పొరేటర్ కైప పద్మలత, 12వ వార్డు కార్పొరేటర్ క్రాంతి కుమార్, 20వ వార్డు కార్పొరేటర్ లక్షీరెడ్డి, 40వ వార్డు కార్పొరేటర్ విక్రమసింహా రెడ్డి, 10వ వార్డు కార్పొరేటర్ యూనూస్ బాష, 19వ వార్డు వైయస్సార్ సిపి నాయకులు బెల్లం మహేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి ఇంకా మున్సిపల్ వివిధ శాఖల అధికారులు, వివిధ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు మేయర్ క్యాంపు కార్యాలయంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

About Author