PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హరిహర క్షేత్రంలో.. 18వ వార్షిక బ్రహ్మోత్సవం..

1 min read

కార్తీక హాస్పిటల్​ ఆధ్వర్యంలో అన్నదానం

  • భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు

కర్నూలు, పల్లెవెలుగు: మంచి మనస్సుతో సనాతన ధర్మాన్ని  ఆచరిస్తే… వారు తలిచిన కార్యం తప్పక నెరవేరుతుందన్నారు కార్తీక హాస్పిటల్ మేనేజింగ్​ డైరెక్టర్​, జనరల్​ ఎం.డి. డా. చంద్రశేఖర్​.  నగరంలోని హరిహర క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వర స్వామి 18వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి అర్చకులు వేదమంత్రోచ్చరణాల మధ్య స్వామి వారికి అర్చనలు, అభిషేకం, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక్​ హాస్పిటల్​ ఎండి, జనరల్​ ఎండి. డా. చంద్రశేఖర్​, గైనకాలజిస్ట్​ డా.పార్వతి దేవి దంపతులు  స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కార్తీక హాస్పిటల్​  ఆధ్వర్యంలోభక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.

About Author