PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హీరోయిన్ కంగ‌న.. కారు చుట్టుముట్టిన రైతులు !

1 min read

పల్లెవెలుగు వెబ్​ : బాలీవుడ్ హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ కారును కొంద‌రు రైతులు చుట్టుముట్టారు. పంజాబ్ లోని చండీగ‌డ్ – ఉనా జాతీయ ర‌హ‌దారి పై కిరాత్ పూర్ సాహిబ్ వ‌ద్ద శుక్రవారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పంజాబ్ లో ప్రవేశించ‌గానే కొంద‌రు రైతులు త‌నను అడ్డుకున్నార‌ని ఆమె ఆరోపించారు. ఇటీవ‌ల రైతుల‌కు వ్యతిరేకంగా కంగ‌న చేసిన వ్యాఖ్యల‌కు వారు క్షమాప‌ణ కోరినట్టు తెలుస్తోంది. పోలీసులు రైతుల‌కు స‌ర్దిచెప్పి కంగ‌న కారును అక్కడి నుంచి పంపించేశారు. ఈ విష‌యం ఇన్ స్టాగ్రామ్ లో కంగ‌న పోస్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా పంజాబ్ పోలీసుల‌కు కంగ‌న కృత‌జ్ఞత‌లు తెలిపింది.

About Author