PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హౌస్ అరెస్ట్ రివ్యూ & రేటింగ్ !!!

1 min read

నిర్మాణ సంస్థ, డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్షకులను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి సిద్ధమ‌వుతుంది. ఈ క్రమంలో ఈ బ్యాన‌ర్‌లో తొలి చిత్రంగా ‘హౌస్ అరెస్ట్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేట‌ర్స్‌లో ఆగ‌స్ట్ 27న‌ విడుదలైన ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, స‌ప్తగిరి, అదుర్స్ ర‌ఘు, ర‌విప్రకాశ్‌, ర‌విబాబు, తాగుబోతు ర‌మేవ్‌, ఫ్రస్టేటెడ్ సునైన‌, కౌశిక్ త‌దిత‌రులు ప్రధాన పాత్రల్లో న‌టించారు. శేఖ‌ర్ రెడ్డి యెర్ర ద‌ర్శక‌త్వంలో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ:
తల్లితండ్రులు మిడ్ నైట్ ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉంటారు. ఆ సమయంలో దొంగలు పడతారు. ఈ జనరేషన్ కిడ్స్ ఎంత అప్డేటెడ్ గా ఎంత బ్రిలియంట్ గా ధైర్యంగా ఆ దొంగలను హౌస్ అరెస్ట్ చేశారు అన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్.
విశ్లేషణ:
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి హీరోలుగా, స్టార్ కమిడియన్స్ గా సక్సెస్ ఫుల్ సినిమాలు చేసి డిఫరెంట్ జానర్ లో పిల్లలతో కలసి ఆద్యంతం ఈ హౌస్ అరెస్ట్ సినిమాలో అలరించారు. అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, అల్లరి రవిబాబు, సునయన, రవి ప్రకాష్, వారి వారి పాత్రల మేరకు చక్కగా నటించి మెప్పించారు. థియేటర్ లో వారి సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి దాకా జబర్దస్త్ లో అలరించిన వినోద్ ట్రాన్స్ జెండర్ పాత్రలో పలు చోట్ల నవ్వులు పూయించాడు. నటుడు ఉన్ని కృష్ణకు ఈ సినిమాలో మంచి పాత్ర లభించింది. పిల్లల విషయానికి వస్తే అయిదుగురు పిల్లలు ఆణిముత్యల్లా ఉన్నారు. స్టార్స్ కమిడియన్స్ తో పోటీ పడి నటించారు. ఈ సినిమా కోసం ఈ పిల్లలను సెలెక్ట్ చెయ్యడంలోనే డైరెక్టర్ సగం సక్సెస్ సాధించాడు. పిల్లల నటనకు థియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ విస్తున్నారు.
ప్లస్ పాయింట్స్:
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్
శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి కామెడీ టైమింగ్
పిల్లల నటన.

డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఎంచుకున్న పాయింట్ బాగుంది. తాను అనుకున్నది అనుకున్నట్లుగా తెరమీద చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక ఇంట్లో అంతమంది నటీనటులను పెట్టి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కథను నడిపించాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ తో అందరికి షాక్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ మొదలు పెట్టడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. కథ పరంగా స్క్రీన్ ప్లే పరంగా, డైలాగ్స్ పరంగా అన్ని విషయాల్లోనూ పూర్తి సక్సెస్ సాధించాడు. కెమెరామెన్ యువరాజ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి, లైటింగ్ పరంగా కెమెరా యాంగిల్స్ పరంగా ఒకే ఇంట్లో 70 శాతం సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మరో హైలెట్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడియన్స్ ను కట్టిపడేశాడు. ఫ్రీ బర్డ్స్ అనే సాంగ్ పిల్లల ఫంక్షన్స్ లో బాగా ప్లే చేస్తారు, సాంగ్ బాగా పాపులర్ అయ్యింది. చంద్రబోస్ లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి, పిల్లల మైండ్ సెట్ లోకి దూరిపోయి ఆయన అద్భుతమైన సాహిత్యం అందించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. నిర్మాత కె నిరంజన్ రెడ్డి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రిచ్ గా నిర్మించారు. ఇలాంటి పిల్లల సినిమా చెయ్యాలనే వాళ్ళ ఆలోచనే వారిని సక్సెస్ ట్రాక్ లో నిలబెట్టింది. ఎడిటర్ చోటా కె ప్రసాద్ పిల్లల సినిమాను చాలా షార్ప్ గా, నీట్ గా కట్ చేశారు. అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ డైరెక్టర్ జీఎం.శేఖర్ నిర్మాణ విలువలు పెంచే విధంగా అద్భుతంగా హౌస్ అరెస్ట్ ను తీర్చిదిద్దారు.

హౌస్ అరెస్ట్ అందరిని ఆకట్టుకుంటుంది. చాలా కాలం తరువాత పిల్లలతో పాటు పెద్దలను కూడా అరెస్ట్ చేస్తుంది. టోటల్ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.

చివరిగా: హౌస్ అరెస్ట్ అందరికి నవ్వులతో అరెస్ట్ చేస్తుంది.

రేటింగ్: 3/5

About Author