PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూపాయి పతనం ఇంకెంత ?

1 min read

పల్లెవెలుగువెబ్ : రూపాయి నేల చూపులు చూస్తోంది. గత కొన్ని రోజులుగా పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రూపాయి విలువ నిన్న చరిత్రలోనే తొలిసారిగా 83 రూపాయల దిగువకు పడిపోయి ఆల్‌టైం కనిష్ఠానికి చేరుకుంది. 82.30 వద్ద నిన్న ట్రేడింగ్ ప్రారంభం కాగా, ఆ తర్వాత ఒక దశలో 82.95 రూపాయలకు పడిపోయింది. మంగళవారం నాటి క్లోజింగ్‌తో పోలిస్తే నిన్న ఒక్క రోజే 61 పైసలు క్షీణించి 83.02 దిగువకు పడిపోయింది. 83 కిందికి పడిపోవడం చరిత్రలోనే ఇది తొలిసారి.

About Author