PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌగిలించుకుంటే రూ. 7 వేలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బ్రిట‌న్ లోని బ్రిస్ట‌ల్ లో కౌగిలింత‌కు రూ. 7వేలు చార్జ్ చేస్తున్నారు. ఇలాంటి సేవ‌లు అందిస్తున్న ఆ వ్య‌క్తి పేరు ట్రెజర్ . ట్ర‌జ‌ర్ లాంటి వారు ఓ వృత్తిలా దాన్ని నిర్వ‌హిస్తున్నారు. దాని పేరు కడల్ థెరపీ.. ఇందులోని వాళ్లను ప్రొఫెషనల్ కడలర్స్ అంటారు. ‘‘మానవ సంబంధాల పట్ల తనకున్న ఆసక్తే నన్ను ఈ వైపు వచ్చేలా చేసింది. ఇతరులకు మానసికంగా దగ్గరకాలేని వారు ఎందరో ఉంటారు. అలాంటి వారి కోసమే నేను. ఇది కేవలం కౌగిలింత మాత్రమే కాదు. వారు కోరుకున్న స్నేహాన్ని, ఓ వ్యక్తి మనకు తోడున్నాడన్న భావనను కల్పించే ప్రయత్నం చేస్తుంటా. కొందరికి ఇది వింతగా అనిపించొచ్చు. మొదట్లో అలా అనిపించినా ఆ తరువాత.. అలవాటు పడుతుంటారు. కొత్త వ్యక్తులను కలిసిన ప్రతిసారీ వారికి కడల్ థెరపీకి సంబంధించిన నియమనిబంధనలు వివరిస్తుంటా. ఈ థెరపీ ద్వారా వారు కోరుకునేదేంటో తెలుసుకుంటా! అలాగే ఈ సమయంలో వారు ఎలాంటి నిబంధనలు పాటించాలో వివరిస్తా..’ అని ట్రెజర్ తెలిపాడు.

                   

About Author