NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌ళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడ‌తాను !

1 min read

పల్లెవెలుగు వెబ్ : టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మ‌ళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడ‌తానంటూ శ‌ప‌థం చేశారు.  ‘‘పెద్ద పెద్ద మహానాయకులతో పని చేశాం. జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పని చేశాం. గడిచిన రెండున్నరేళ్లుగా సభలో ఎన్నో విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకున్నాం. ఏనాడూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ.. రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఇలాంటి అనుభవాలు నేను చూడలేదు“ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. “ ఇన్నేళ్లుగా జరగని అవమానాలను భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి.. కుప్పం ఎన్నికల తర్వాత నేను రావాలి. నా ముఖం చూడాలన్నా కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్‌లో పడరాని అవమానాలు పడిన సందర్భాలున్నాయి. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా ఏ పరువు కోసం పని చేశానో.. ఇన్నేళ్లుగా బతికామో.. నా కుటుంబం, నా భార్య విషయం కూడా తీసుకొచ్చి అవమానించారు. మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా’’ అని చంద్రబాబు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. చంద్ర‌బాబు నిర్ణ‌యం ప‌ట్ల రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తి నెల‌కొంది.

About Author