PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ అమలు – జిల్లా ఎస్పీ

1 min read

కౌంటింగ్ పాస్ ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ సెంటర్ లోనికి అనుమతి.

పల్లెవెలుగు వెబ్ నారాయణపేట:  డిసెంబర్ 3 రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల లెక్కింపు ప్రక్రియ లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీ దత్త బృందావన కళాశాలలో మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది అని లెక్కింపు ప్రక్రియ పూర్తి సజావుగా కొనసాగేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అన్ని విధాలుగా బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసిందని జిల్లా శ్రీ యోగేష్ గౌతమ్ IPS గారు  తెలిపారు. ఈ సందర్భంగా లెక్కింపు ప్రక్రియ కొనసాగే శ్రీ దత్త బృందావనం ప్రాంగణం ఒక కిలోమీటర్ల చుట్టుపక్కల ప్రాంతం అంతా నిషేధాజ్ఞలు కొనసాగుతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.

1) రేపు కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు గుమ్మిగుడి ఉండటానికి అనుమతి లేదు.

2) రేపు ఎన్నికల లెక్కింపు పూర్తి అయ్యేంతవరకు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపులు, బెల్ట్ షాపులు నిర్వహించకూడదు.

3) కౌంటింగ్ హాల్ అనుమతి ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్ హాల్ పరిసరాలకు రావాలి.

4) కౌంటింగ్ హాల్ పాసెస్ ఉన్న ఏజెంట్లు సెల్ ఫోన్లు, అగ్గి డబ్బా, ఇంకు బాటిల్, లాంటి అనుమతి లేని వస్తువులను తీసుకురాకూడదు.

5) ఏజెంట్ల ఎక్స్చేంజ్ అనేది ఉండదు, తరచూ లోనికి బయటకు తిరిగే అవకాశం ఉండదు.

6) శ్రీ దత్త బృందావనం కళాశాల పరిసర ప్రాంతాల్లో 200 మంది పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

7) కౌంటింగ్ అయిన తరువాత 24 గంటల వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు, టపాసులకు అనుమతి లేదు. శ్రీ దత్త బృందావనం కళాశాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి సజావుగా ఎన్నికల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ గారు తెలిపారు.ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన జిల్లా పోలీసు యంత్రాంగం కౌంటింగ్ హాల్ నందు పరిసరాల లో బందోబస్తుకు వచ్చిన పోలీసులకు అదనపు ఎస్పి  నాగేంద్రుడు, DSP K సత్యనారాయణ లు భద్రతాపరమైన సూచనలు ఇవ్వడం జరిగింది.

About Author