PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రస్థాయి కరాటేలో.. క్రీడాకారుల ప్రతిభ..

1 min read

పథకాలు సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపిన జిల్లా ఉషూ సంఘం చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ

పల్లెవెలుగు: ఆగస్టు 27 28 తేదీలలో ప్రకాశం జిల్లా చీమకుర్తిలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో జిల్లా క్రీడాకారులు 12 ఓల్డ్ మెడల్ 4 సిల్వర్ 16 పథకాలు సాధించారు.ఈ సందర్భంగా పెద్ద మార్కెట్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం నాడు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా ఉషూ సంఘం  చైర్మన్ డాక్టర్ శంకర్ శర్మ విచ్చేసి మాట్లాడుతూ చిన్నారులు చదువుతోపాటు కరాటే ఉషూ లాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఆరోగ్యం కొరకు ఆత్మ రక్షణ కొరకు తోలుపడుతుందని అన్నారు రాష్ట్రస్థాయి పోటీలో   పథకాలు సాధించినందుకు క్రీడాకారులకు అభినందిస్తూ ఇలాగే రోజు క్రీడాకారులు సాధన చేయాలని ఈ కరాటే మార్షల్ ఆర్ట్స్ ను తల్లిదండ్రులు ప్రోత్సహించాలని అన్నారు అనంతరం పథకాలు సాధించిన క్రీడాకారులకు పథకాలు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ బాలికల పాఠశాల హెడ్మాస్టర్ మౌలాలి మాస్టర్లు క్రాంతి పాల్గొన్నారు అని మాస్టర్ టి శ్రీనివాసులు తెలిపారు.

About Author