NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వికలాంగుల సింహగర్జన గోడపత్రిక ఆవిష్కరణ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో  జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి అధ్యక్షతన ఈనెల 29వ తేదీన కర్నూల్ ఎస్ బి సి కాలేజ్ నందు జరిగే వికలాంగుల సింహ గర్జన గోడ పత్రికను మంగళవారం గడివేములలో వికలాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు  వికలాంగుల పింఛన్ 3000 నుండి 6000 రూపాయలకు పెంచాలని ఆర్పిడబ్ల్యుడి ఆక్టివ్ 2016 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యధావిధిగా అమలు చేయాలని సంక్షేమ పథకాలలో రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వ ప్రవేట్ రంగాల్లో వికలాంగుల రిజర్వేషన్ అమలు చేయాలని మొదలగు అంశాలతో కర్నూల్ లో 10,000 మంది వికలాంగులతో సింహగర్జన జరుగుతున్నందున ఈ సింహగర్జనకి ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు కదిలి వచ్చి ఈ సింహగర్జన విజయవంతం చేసి మన ఐక్యతను చాటాలని రాజకీయ పార్టీలకు కనువిప్పు అయ్యేటట్టు చేయాలని ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు రమణారెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రంగస్వామి శ్రీనివాసులు ఏ సామన్న వహీదా రాజు సోబి సాహెబ్ సుమంత్ కుమార్ రెడ్డి ఎం సుబ్బారావు పి పెద్దయ్య మొదలగువారు పాల్గొని సింహ గర్జన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

About Author