PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జుట్టుకు పెరిగిన డిమాండ్: ధ‌ర వేల‌ల్లో..!

1 min read

ప‌ల్లె వెలుగు వెబ్: పాత రోజుల్లో జుట్టు క‌త్తిరించాక పేడ దిబ్బల్లో వేసేవారు. ఎందుకూ ప‌నికిరాని వ‌స్తువు కింద చూసేవారు. ఇప్పుడు మ‌నిషి జుట్టుకు డిమాండ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. జుట్టు కొన‌డానికి.. అమ్మడానికి అక్రమ మార్గాలు ఎన్నుకున్నారంటేనే అర్థం అవుతోంది.. ఆ జుట్టు ఉన్న డిమాండ్ ఎలాంటిదో. ప్రపంచ వ్యాప్తంగా సిల్కీ హెయిర్ ఉన్నది ఇండియాలోని ద‌క్షిణాది ప్రాంతం వాళ్లదే. అందుకే సిల్కీ హెయిర్ కు అధికంగా డిమాండ్ ఉంటోంది. విగ్గుల త‌యారీలో కూడ న‌లుపు రంగు విగ్గుల‌కు డిమాండ్ పెరిగింది. మిగిలిన రంగుల విగ్గుల వాడ‌కం క్రమేణా త‌గ్గింది. దీంతో ద‌క్షిణాది వారి వెంట్రుక‌ల‌కు డిమాండ్ పెరిగింది.
జుట్టు ఎక్కడికి త‌ర‌లిస్తారంటే..
దేశంలో.. ముఖ్యంగా ద‌క్షిణాది ప్రాంతాల‌లో ఉన్న సిల్కీ హెయిర్ కు ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకుని .. కొంద‌రు బృందాలుగా ఏర్పడ్డారు. వివిధ ప‌ద్దతుల్లో వెంట్రుక‌లు సేక‌రిస్తారు. ఇంటి ద‌గ్గరికే వ‌చ్చి కూడ ఆడ‌వారి త‌ల వెంట్రుక‌లు సేక‌రిస్తారు. ఆడ‌వారి త‌ల వెంట్రుక‌లు చాలా ఖ‌రీదైన‌వి. ఇలా వివిధ ర‌కాలుగా సేక‌రించిన జుట్టును.. వివిధ ప‌ద్దతుల ద్వార హైద‌రాబాద్ కు పంపుతారు. అక్కడి నుంచి మ‌య‌న్మార్ మీదుగా చైనా త‌ర‌లిస్తున్నారు. చైనా విగ్గుల తయారీలో ప్రపంచంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంది. ‘అగ్గిపెట్టె, స‌బ్బుబిల్ల, కుక్కపిల్ల.. క‌వితకేది కాదు అన‌ర్హం’ అని శ్రీశ్రీ అన్నట్టు.. చైనా వాళ్లు గుండు సూది నుంచి త‌ల వెంట్రుక‌ల వ‌ర‌కు దేన్నీ వ‌దిలిపెట్టడంలేదంటే అతిశ‌యోక్తి కాదు.

స్మగ్లింగ్ చేయాల్సిన అవ‌స‌రం ఏమిటి?
లూజ్ హెయిర్ సేక‌రించే వారికి జీఎస్టీ ఉండ‌దు. అదే ఎయిర్ కార్గో ద్వార విదేశాల‌కు త‌ర‌లించాలంటే వివిధ ప‌న్నులు ఎగుమ‌తి చేసేవారి మీద ప‌డ‌తాయి. దీంతో దేవాల‌యాల నుంచి, సెలూన్ షాప్ ల నుంచి సేక‌రించ‌కుండా.. వివిధ ప‌ద్దతుల్లో లూజ్ హెయిర్ సేక‌రించి.. మ‌య‌న్మార్ కు అక్కడ నుంచి చైనాకు త‌ర‌లిస్తున్నారు. ఫ‌లితంగా దేశానికి రావాల్సిన కోట్లాది రూపాయ‌ల ప‌న్నులు ఎగ్గొడుతున్నారు. అక్రమంగా వెంట్రుక‌లు ఎగుమ‌తి చేస్తున్నవారికి.. డ‌బ్బు కూడ అక్రమ ప‌ద్దతుల్లోనే వ‌స్తోంది. ఇండియా నుంచి ఎగుమ‌తి చేసేవారికి..హ‌వాలా ప‌ద్దతుల్లో చైనా వ్యాపారులు డ‌బ్బు పంపిస్తున్నారు.
ప్రభుత్వం ఖ‌చ్చిత‌మైన విధానాలు రూపొందించి .. అమ‌లు చేయ‌డం ద్వార అక్రమ ర‌వాణాను క‌ట్టడి చేయొచ్చు. ఇప్పటికే మ‌య‌న్మార్ బార్డర్ లో అక్రమంగా ర‌వాణ చేస్తున్నవారిని అరెస్టు చేసింది. వెంట్రుక‌లకు డిమాండ్ పెర‌గ‌డంతో.. అక్రమార్కులు నిబంధ‌న‌ల‌లోని లొసుగుల‌ను అడ్డంపెట్టికుని యథేచ్చగా అక్రమ ర‌వాణ చేస్తున్నారు. ఫ‌లితంగా సక్రమంగా వ్యాపారం చేస్తున్నవారు ఇబ్బందిప‌డుతున్నారు. కాబ‌ట్టి ప్రభుత్వం క‌ఠిన‌మైన చ‌ర్యలు తీసుకోవాలి ప‌లువురు వ్యాపారులు కోరుతున్నారు.

About Author