భారత కుబేరుడు.. అదానీ అప్పు ఎంతో తెలుసా ?
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2022/05/4519.jpg?fit=500%2C280&ssl=1)
పల్లెవెలుగువెబ్ : అదానీ గ్రూపునకు ఏడాది మార్చి నాటికి రూ. 2.2 లక్షల కోట్ల అప్పులున్నాయన్న విషయం ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. అయితే ‘అప్పు’ ఇంత భారీగా ఉన్నప్పటికీ కూడా… రుణాల చెల్లింపుల్లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. అదానీ గ్రూపు ఆదాయాలు మెరుగ్గానే ఉండడంతోపాటు కోవిడ్ కారణంగా గత రెండేళ్ళుగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండడం కూడా ఈ గ్రూపునకు కలిసొస్తున్నట్లుగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక వ్యాపార విస్తరణలో భాగంగా ఆయా రంగాల్లో అదానీ గ్రూపు భారీగా అప్పులు చేస్తూనే వస్తోంది. ఇప్పుడు… కొత్తగా కొన్ని సిమెంట్ కంపెనీలను టేకోవర్ చేయాలని నిర్ణయించిన క్రమంలో… అదానీ గ్రూపు రుణభారం మరింతగా పెరగనుంది.