PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 ఇన్సూరెన్స్ సొమ్ము కోసం బామ్మర్దిని అంతమందించిన బావ

1 min read

– ప్రమాదంగా చిత్రీకరించి- పోలీసులకు చిక్కిన వైనం

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బీమా సొమ్ము కోసం సొంత బామ్మర్దిని అంతముందించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు ఓ గనుడు, ఈ అమాననీ య సంఘటన మండల కేంద్రంలోని చెన్నూరులో వెలుగులోకి వచ్చింది, చితకొమ్మదిన్నె సీఐ ఎస్ పి ఎస్ శంకర్ నాయక్ తెలిపిన వివరాలకు మేరకు మండలంలోని కనపర్తి గ్రామానికి చెందిన భూమిరెడ్డి నారాయణరెడ్డి వయసు(38) సంవత్సరాలు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు, ఈ క్రమంలో కొన్ని ఏళ్ల క్రితం తన సోదరిని చెన్నూరు కు చెందిన బాల గురవి రెడ్డి కుమారుడు అయిన పాత కుంట బాల గురు ప్రసాద్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారని తెలిపారు, అయితే కుటుంబ ధర్నాల వల్ల భూమిరెడ్డి నారాయణరెడ్డి మద్యానికి బానిస వివాహం కూడా చేసుకోలేదన్నారు, నారాయణరెడ్డి ఉన్న స్థితిని గమనించిన తన బావ బాల గురుప్రసాద్ రెడ్డి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో 12.5 లక్షలకు రెండు బీమా పాలసీలు చేయించడం జరిగిందన్నారు, ఈ పాలసీలకు నా మీనీగా తన భార్య పేరు పెట్టుకోవడం జరిగిందన్నారు, కాగా ఈ పాలసీల కోసమే తన బామ్మర్ది నారాయణరెడ్డిని అంతం మొందించాలనే దుర్మార్గపు ఆలోచన గురు ప్రసాద్ రెడ్డికి రావడంతో ఈనెల 18వ తేదీ బుధవారం రాత్రి తన బామ్మర్ది నారాయణరెడ్డిని చెన్నూరు శివారులోనికి రప్పించి మద్యం బాగా తాగించడం జరిగిందన్నారు, మద్యం మత్తులో ఉన్న తన బామ్మర్ది నారాయణరెడ్డి తలపై పెద్ద దిమ్మెతో మోది హతమార్చడం జరిగిందని తెలిపారు, అలాగే మృతదేహాన్ని  కడప- కర్నూలు జాతీయ రహదారి( విద్యుత్ సబ్స్టేషన్) సామాజిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని రోడ్డుపై పడేసి ఇంటికి వెళ్ళిపోయాడని తెలిపారు, రాత్రి వేళ కాబట్టి పలు వాహనాలు మృతదేహం పై వెళ్లడంతో మృతదేహం చీద్రమైపోయింది అన్నారు, విషయం  తెలుసుకున్న సమీప టోల్ ప్లాజా వాహన సిబ్బంది గుర్తించి మృతుడు వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా సమాచారాన్ని మృతుని కుటుంబ సభ్యులకు తెలియపరచడం జరిగిందన్నారు, నిందితుడు బాల గురు ప్రసాద్ రెడ్డి ఏమీ తెలియనట్లు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి తన బామ్మర్దిని గుర్తుతెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు, దీంతో పోలీసులు కూడా రోడ్డు ప్రమాద కేసుని నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందన్నారు, మృతుడు నారాయణ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించే సమయంలో బావ బాల గురు ప్రసాద్ రెడ్డి ప్రవర్తనలో తేడా గమనించిన బంధువులు స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వడం జరిగిందన్నారు, దీంతో పోలీసులు బాల గురు ప్రసాద్ రెడ్డి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో తానే తన బామ్మర్దిని హత్య చేసినట్లు అంగీకరించడం జరిగిందన్నారు, ముద్దాయి బాల గురు ప్రసాద్ రెడ్డిని హత్య కేసు నేరం102/2024, 302 గా నమోదు చేసి కోర్టుకు హాజరపరచగా శనివారం 12 గంటలకు ముద్దాయిని న్యాయమూర్తి రిమాండ్ కు పంపినట్లు సీఐ ఎస్ పి ఎస్ శంకర్ నాయక్ తెలిపారు.

About Author