PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్న ఒక్క చంద్రబాబు తోనే సాధ్యం

1 min read

కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలన్నా, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావాలన్న ఒక్క చంద్రబాబు తోనే సాధ్యమని కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కోడుమూరు రోడ్డులో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన అమిలియో మెడికల్ ఇన్స్టిట్యూషన్ మొదటి వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన నాగరాజు విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నతమైన స్థాయిలో స్థిరపడి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు..ఇక  వైసీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా బ్రష్టు పట్టించిందన్న ఆయన.. రాష్ట్రం లో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్డున పడ్డారని ఆరోపించారు..విద్యార్థులు వారి తల్లిదండ్రులు బాగా ఆలోచించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే తెలుగు దేశం పార్టీని గెలిపించాలని నాగరాజు కోరారు… ఈ కార్యక్రమంలో అమిలియో హాస్పిటల్ ఎం.డి ప్రసాద్, అమిలియో ఇన్స్టిట్యూషన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

About Author