PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జాక్ పాట్ లాట‌రీ.. రూ. 10 వేల కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికాలో ఓ వ్యక్తికి అదృష్టం ఊహకందని రేంజ్‌లో వరించింది. రెండు డాలర్లు పెట్టి కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ ఏకంగా రూ.10,136 కోట్లు తెచ్చిపెట్టింది. మెగా మిలియన్స్‌ అనే సంస్థ ఈ లాటరీ నిర్వహించింది. జాక్‌పాట్‌ బహుమతి పొందిన టికెట్‌ వివరాలను ఆ సంస్థ శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని ఓ పెట్రోల్‌ బంక్‌లో ఈ టికెట్‌ అమ్ముడైందని తెలిపింది. అయితే, ఈ బంపర్‌ బహుమతి పొందిన అదృష్టవంతుని వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. అయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే ఈ లాటరీలో 2015 నుంచి జరిగిన 29 డ్రాల్లో ఒక్కరు కూడా జాక్‌పాట్‌ బహుమతి గెలవలేదు.

                                   

About Author