జగన్ కు ఆగస్టులో ఇబ్బంది తప్పదు : జడ్జి
1 min read
పల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆగస్టులో సంక్షోభం తప్పదని జడ్జి రామకృష్ణ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. న్యాయపరమైన అంశాలు బహిరంగపర్చడం సరికాదని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రికి వచ్చే నెలరోజుల్లో ఇబ్బందులు తప్పవని తెలిపారు. చంద్రబాబును నడిరోడ్డు పైన కాల్చిచంపాలన్న కేసులో జగన్ ను ముద్దాయిగా నిలబెట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయని అన్నారు. తన స్వగ్రామం చిత్తూరు జిల్లా బి.కొత్తకోట నుంచి గవర్నర్ బంగ్లా వరకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్దమవుతున్నట్టు ఆయన తెలిపారు.