PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పేదల సంక్షేమమే జగనన్న లక్ష్యం

1 min read

ఎమ్మిగనూరు, పల్లెవెలుగు:  పట్టణంలోని 13 వ వార్డ్ ఎస్ ఎన్ ఎస్ స్కూల్ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బుట్టా రేణుక,ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్ గారు,వార్డ్ కౌన్సిలర్  జమీల ( అపోలో షబ్బీర్ అహ్మద్. వై సి యస్  చైర్మన్) పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ మేలు చేసిన ప్రభుత్వాన్ని మరోసారి ఆశ్వీరదించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక విన్నవించారు. వ్యాపారులు, వృ ద్ధులు, మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సంక్షేమ పథకాలను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకు అందించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి వైఎస్ జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకో వాలని పిలుపునిచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో సంక్షేమ పథకాలు జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే అందేవని, ఇప్పుడు జగనన్న పాల నలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్నాయని తెలిపారు. ఈ ప్రచారంలో వార్డు నాయకులు మహబూబ్ బాషా, ఫయాజ్, బాషా, సలీం, ఖజా,  ఇంతియాజ్, ఇక్బాల్ , చాందు, అలీబాషా, ముక్తార్, రహంతుల్లా, కాశీం, చైర్మన్లు, కౌన్సిలర్లు,వైస్ చైర్మన్లు,కో ఆప్షన్ మెంబర్స్,మాజీ కౌన్సిలర్లు, వార్డ్ ఇన్చార్జిలు,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author