PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీ సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ ప్రొఫెషనల్ డైరెక్టర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకౌంటెన్సీ, బ్యాంకింగ్ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీకి చేయనున్నారు. అకౌంటెన్సీ విభాగంలో ఛార్టర్డ్ అకౌంటెంట్ లేదా కాస్ట్ అకౌంటెంట్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ అర్హతతో బ్యాంకింగ్ విభాగంలో 5 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ప్రొఫెషనల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మేనేజింగ్ డైరెక్టర్, A.P. స్టేట్, కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఎన్టీఆర్ సహకార భవన్, D నం. 27-29-28, గవర్నర్‌పేట, విజయవాడ-520002. ఎ.పి చిరునామాకు దరఖాస్తులు పంపించాలి. దరఖాస్తు ఫారమ్ లనుhttps://apcob.org/wp-content/uploads/2022/11/Application-format-for-PDs.pdf ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ నవంబర్ 17, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పూర్తి వివరాలకు https://apcob.org/ వెబ్ సైట్ ను సందర్శించొచ్చు.

About Author