PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీబీపీలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక సైట్ recruitment.itbpolice.nic.in సందర్శించి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 23న ప్రారంభమవుతుంది. డిసెంబర్ 22, 2022న ముగుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 287 పోస్టులను భర్తీ చేయనున్నారు.మొత్తం 287 పోస్టుల్లో విభాగాల వారీగా చూస్తే.. కానిస్టేబుల్ (టైలర్) 18 పోస్టులు, కానిస్టేబుల్ (గార్డినర్) 16 పోస్టులు, కానిస్టేబుల్ (కాబ్లర్) 31 పోస్టులు, కానిస్టేబుల్ (సఫాయి కరంచారి) 78 పోస్టులు, కానిస్టేబుల్ (వాషర్‌మన్) 89 పోస్టులు, కానిస్టేబుల్ (బార్బర్) 55 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అన్ని విభాగాలకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు కానిస్టేబుల్ (టైలర్, గార్డనర్ & కోబ్లర్) పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాలు, కానిస్టేబుల్ (సఫాయి కరంచారి, వాషర్‌మన్ మరియు బార్బర్) పోస్టులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను .. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

About Author