PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీపీసీలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీపోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అంటే అక్టోబర్ 28 నుంచి ప్రారంభమవుతుంది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ntpc.co.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 11 నవంబర్ 2022. ఈ పోస్టులను గేట్ 2022 స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

About Author