PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్బీఐలో ఉద్యోగాలు

1 min read

పల్లెవెలుగువెబ్ : నిరుద్యోగులకు ఎస్బీఐ మరో శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1422 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇందులో 1400 రెగ్యులర్ ఉద్యోగాలు కాగా.. మరో 22 బ్యాక్ లాగ్ లాగ్ ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది స్టేట్ బ్యాంక్. అభ్యర్థులు sbi.co.in లేదా ibpsonline.ibps.inవెబ్ సైట్లలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ నిన్నటి నుంచి (అక్టోబర్ 18) నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

About Author