PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లాభాల బాటలో కేడీసీసీ బ్యాంకు

1 min read

2020-21 సంవత్సరమునకు రూ.3.88 కోట్ల లాభం
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కోవిడ్​ –19 విజృంభిస్తున్నప్పటికీ జిల్లా రైతాంగానికి, బ్యాంకు ఖాతాదారులకు సేవలందించుటలో కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ముందు వరుసలో ఉందని ఆ బ్యాంకు సీఈఓ రామాంజనేయులు తెలిపారు. 2020-21 సంవత్సరమునకు రికవరీలలో గణనీయమైన ప్రగతిని సాధించి నిరర్థక ఆస్తులను రూ.177.00 కోట్ల నుండి రూ.141.00 కోట్లకు తగ్గించుకోవడమైనది. అంతేకాకుండా వివిధ రకాల ఋణాలు అందించి బ్యాంకు వ్యాపార విస్తృతి పెంచుకొని, 2020-21 సంవత్సరానికి రూ.3.88 కోట్లు లాభాలను గడించిందని తెలుపుటకు సంతోషించుచున్నాము. ప్రతి అంశములోను 2020-21 సంవత్సరానికి గణనీయమైన ప్రగతిని సాధించడమైనది.2020-21 సంవత్సరానికి రూ.3.88 కోట్లు లాభాన్ని గడించి, 2021-22 సంవత్సరము నాటికి మరింత లాభాలను ఆర్జించి వాటాదారులకు డివిడెండు పంచేదిశలో పయనించేందుకు తగు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని కేడీసీసీ బ్యాంకు సీఈఓ రామాంజనేయులు స్పష్టం చేశారు.

About Author