PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈ నాయ‌కుడికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి.. క‌ర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భ‌ర‌త్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  క‌ర్నూల్లో ఇప్పుడు పాలిస్తున్న నాయ‌కుడికి రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌ర‌త్ అన్నారు. న‌గ‌రంలోని 11వ వార్డు ఖ‌డ‌క్‌పుర వీధిలో నిర్వ‌హించిన దోమ‌ల‌పై దండ‌యాత్ర కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని స్థానిక నాయ‌కుడు మెహ‌బూబ్ ఖాన్ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన హైపోద్రావ‌ణం పిచికారి ప‌నులు, ఫాగింగ్ పనులు ప్రారంభించి, స్థానికుల‌కు ఆల్ అవుట్‌లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ డ‌బ్బులు సంపాదించుకునేందుకు రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన నాయ‌కుల‌ను స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌జ‌లు నిల‌దీయాల‌ని చెప్పారు. కులం, మ‌తం ప్ర‌తి ఒక్క‌రికీ వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో మంచి చేసే నాయ‌కుడినే గెలిపించుకోవాల‌ని సూచించారు. గ‌త ప‌దేళ్లుగా అధికారంలో లేక‌పోయినా ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తూనే ఉన్నామ‌ని ఆయ‌న అన్నారు. అధికారంలో ఉంటే ఎక్కువ అభివృద్ధి ప‌నులు చేసేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రించారు. కులం పేరు చెప్పి ఓట్లు అడిగిన నాయ‌కులు.. ఆ కులానికి కూడా ఏమీ చేయ‌లేద‌న్నారు. ఓటు వేసే వారం రోజుల ముందు త‌మ‌పై ఇష్టానుసారంగా మాట్లాడుతార‌ని మండిప‌డ్డారు. త‌న‌ను గెలిపిస్తే కుల‌, మ‌తాల‌కు అతీతంగా అంద‌రికీ మంచి చేస్తాన‌ని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే ఉచిత ఇసుక విధానం తీసుకొస్తామ‌ని.. భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్నారు. అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తామ‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఖాద‌ర్ బాషా,చంద్ర‌శేఖ‌ర్‌, స‌బా, స‌లీం, ఆసిఫ్‌, జ‌లీల్‌, పండు, ఈశ్వ‌ర్‌, చిన్న‌మ్మి, పెంచ‌ల‌య్య‌, అనంత‌య్య‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author