కర్నూలు .. సీఎం టూర్ ఇలా సాగుతుంది !
1 min read
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఓర్వకల్లు మండలం గుమితం తండా దగ్గర ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్థాన చేయనున్నారు.
అధికారుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి :
- ఇవాళ ఉదయం 9.35 గంటలకు తాడేపల్లిలోని ఇంటి నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు.
- 9.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- ప్రత్యేక విమానంలో బయలుదేరి 10 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 11.15 గంటలకు గుమితం తండా గ్రామానికి చేరుకుంటారు. అక్కడే ఉమ్మడి జిల్లా వైసీపీ నాయకులు, ముఖ్య ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.
- 11.35 గంటల నుంచి 12.15 గంటల వరకు ఈ ప్రాజెక్టు శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రీన్కో సంస్థ ప్రతినిధులతో ప్రాజెక్టు ప్రాధాన్యంపై చర్చిస్తారు.
- అనంతరం 12.40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయానికి వెళ్లి… 12.50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరు కుంటారు.
- 1.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని… అక్కడి నుంచి 2.05 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటాని జిల్లా అధికారులు తెలిపారు. సీఎం పర్యటన ఏర్పాట్లను సోమవారం రాత్రి వరకు కలెక్టర్ కోటేశ్వరరావు పర్యవేక్షించారు. ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.