PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు వైసీపీ టిక్కెట్​.. హఫీజ్​ఖాన్​కే కేటాయించాలి..

1 min read
  • పెట్రోల్​ పోసుకుని…ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులు
  • వారించి.. సర్దిచెప్పిన వైసీపీ కర్నూలు రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి

కర్నూలు, పల్లెవెలుగు: కర్నూలు అసెంబ్లీ వైసీపీ టికెట్ స్థానిక ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ కు ఇవ్వాలని కార్యకర్తలు, ఎమ్మెల్యే అనుచరులు డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని రాయల్ ఫంక్షన్ హాల్ లో కర్నూలు  వైసీపీ అసెంబ్లీ టికెట్ విషయంపై కర్నూలు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్, కర్నూలు మేయర్ బీవై. రామయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున వచ్చారు. సభలో కార్యకర్తలు వైసిపి టికెట్ హాఫీస్ ఖాన్ కే ఇవ్వాలని ఆందోళన చేశారు. తమ నేతకు ఎలాంటి రాజకీయ పదవులు అవసరం లేదని ఎమ్మెల్యేగానే  ఉండాలని వారు కోరారు. ఎమ్మెల్యే హాఫీస్ ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేయడని తెలిపారు. అనంతరం కర్నూలు జిల్లా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంకా సమయం ఉంది…. ఆందోళన చెందవద్దని కార్యకర్తల మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తానని తెలిపారు. హాఫీస్ ఖాన్ పై ముఖ్యమంత్రి కి మంచి అభిప్రాయం ఉందని ఎక్కడ హాఫీస్ ఖాన్ విలువను తగ్గించమని తెలిపారు. కార్యకర్తల మనోభావాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి హాఫీస్ ఖాన్ కు న్యాయం చేస్తానని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అభిమానుల.. ఆత్మహత్యాయత్నం:

కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​కు… మళ్లీ టిక్కెట్​ కేటాయించాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటామంటూ ఇద్దరు  యువకులు పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  ఆదివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ ఇంటి ఆవరణలో జరిగిన కార్పొరేటర్ల మీటింగ్​లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన కర్నూలు రీజనల్ కో ఆర్డినేటర్​ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​ వాదించారు. కొందరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భాను ప్రకాశ్​, ఖయ్యుం వద్ద నున్న పెట్రోల్​ బాటిల్​ను తీసుకుని దూరంగా విసిరేశారు. కర్నూలులో జరిగే రాజకీయాలను వైసీపీ పెద్దలు గ్రహించాలని, కొత్త వ్యక్తికి టిక్కెట్​ ఇస్తే.. సీటు కోల్పోతామని తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యే టిక్కెట్​ ఎంఏ హఫీజ్​ఖాన్​కు ఇవ్వాలని భాను ప్రకాశ్​, ఖయ్యుంతోపాటు నాయకులు, కార్యకర్తలు డిమాండ్​ చేశారు. ఇందుకు స్పందించిన  కర్నూలు రీజనల్ కో ఆర్డినేటర్​ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ..మీరు ఆత్మహత్యకు పాల్పడటం లాంటివి చేయవద్దని, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్​ఖాన్​కు తగిన న్యాయం జరిగేలా సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.

About Author