PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పౌరాణిక నటకేసరి లోద్దిపల్లి అల్లా బాకాష్ సంతాప సభ 

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు నగరం నందలి కోర్టు రోడ్ లో గల యునైటెడ్ క్లబ్ నందు  సుప్రసిద్ధ కళాకారులు పౌరాణిక నటదీగ్గజం లోద్దిపల్లి అల్లా బకాష్ సంతాప సభ కర్నూలు రంగస్థల కళాకారులుపూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సంతాప సభ కార్యక్రమంలోలోద్దిపల్లి బకాష్  వృత్తిని ఉపాధ్యాయులుగా కొనసాగుతూ పౌరాణిక నాటక రంగాలలో శ్రీకృష్ణ సత్య హరిచంద్ర అర్జున పాత్రలను పోషించి మెప్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనేక ప్రభుత్వ ప్రశంసలు పొంది ప్రజా సంఘాల ప్రశంసలు పొంది రాష్ట్ర ప్రభుత్వం పురస్కారం ఎన్టీఆర్ అవార్డును అందుకున్నారు. రంగస్థలంపై సత్యహరిచంద్ర పాత్రధారిగా 1500 వేదికలపై తన నాటకాన్ని ప్రదర్శించిన ఏకైక కళామతల్లి ముద్దుబిడ్డ కలియుగ హరిశ్చంద్రుడు లొద్దిపల్లి అల్లా బకాష్ రాయలసీమ రంగస్థల మణిరత్నం మహానటుని వారసులుగా పౌరాణిక పద్య నాటకాలకు జీవం పోయాలని చంద్రన్న, నాగభూషణం నాయుడు వివి రమణారెడ్డి డి దస్తగిరి పి హనుమంతరావు చౌదరి బైలుప్పల షఫీయుల్లా పాండురంగయ్య క్రిస్టఫర్ మహనీయ గొప్ప  పౌరాణిక పద్య నాటక కర్త లోద్దిపల్లి అల్లా బాకాష్ ను కొనియాడారు. తన తండ్రి  రంగస్థల కళాకారుల క్షేమ సమాచారం కోరేవారని రంగస్థల కళాకారులకు సహాయ సహకారాలు అందించేవారని మన సాంస్కృతి సాంప్రదాయాలు అంటే ఆయనకు ప్రాణం అని రంగస్థలం వేదికగా తన జీవితాన్ని కొనసాగించాలని ప్రేమ ఆప్యాయతలకు తన తండ్రి లొద్దిపల్లి అల్లా బకాష్ మారుపేరని ఆయన కుమారులు న్యాయశాఖ విశ్రాంత ఉద్యోగి మహమ్మద్ హుస్సేన్ అన్నారు. రంగస్థల కళాకారులు నంది అవార్డు గ్రహీత శామ్యూల్ హరిచంద్ర పద్యాలను పాడి వినిపించారు. అభినవ రచయిత తన స్వీయ రచన డి పార్వతయ్య అక్షరమాల పద్యాలను చదివి వినిపించారు. కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు నాగేశ్వరరావు డి యన్ వి సుబ్బయ్య బిసన్న రామకృష్ణ శామ్యూల్ అరుణకుమారి డీ పుల్లయ్య రాధిక రాజశేఖర్ షేక్షావలి కర్నూలు జిల్లా రంగస్థల కళాకారులు పాల్గొని లొద్దిపల్లి అల్లా బాకాష్ కి ఘనంగా నివాళులర్పించారు.

About Author